మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్తత

భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఒకటిగా బంగ్లాదేశ్ కు తూర్పున మయన్మార్ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం మణిపూర్ .ఇక్కడ నివసించే జనాభాలో సగం మంది మైతేయిలు ఉంటే 43% కుకీలు మరియు నాగాలు అనే షెడ్యూల్ గిరిజన జాతి మైనారిటీ జాతులుగా నివసిస్తున్నారు.
మైతేయి జనాభా మణిపూర్ మధ్య భాగంలో ఉన్నటువంటి 10% మైదాన భూభాగంలో నివసిస్తుండగా మిగిలినటువంటి 90% కొండల ప్రాంత భూభాగంలో కుకీలు మరియు నాగాలు అనే మైనారిటీ గిరిజన జాతులు నివసిస్తున్నాయి. కుకీలు మరియు నాగాలతో పోలిస్తే మైతే ఈ జనాభా విద్య అవకాశాలలో ఉద్యోగ అవకాశాలలో రాజకీయ అవకాశాలలో ముందు ఉంటున్నారు. మణిపూర్లో ఈ జాతుల మధ్య వైరమే ప్రస్తుత పరిస్థితులకు దారితీసింది.
మణిపూర్ లో కుకీజాతికి చెందిన ఇద్దరు మహిళలపై జరిగిన సంఘటన సమాజాన్ని ప్రశ్నించే విధంగా తలదించుకునే విధంగా జరిగింది .ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటివరకు 170 మంది చనిపోగా 400 మంది గాయాల పాలయ్యారు అదే విధంగా 60 వేల మంది వరకు వారి రాష్ట్రంలోనే నిరాశ్రయులయ్యారు.
ప్రభుత్వం 355వ అధికరణమును మణిపూర్లో అమలుపరుస్తూ ఈ క్రింది చర్యలను తీసుకుంది
మణిపూర్ లోని పరిస్థితులను అదుపులోకి తీసుకొని రావడానికి 40 వేల మంది పారా మిలటరీ దళాలను మణిపూర్లోకి పంపించింది
మణుపూర్ లో ఉదృత పరిస్థితులు నెలకొన్నటువంటి బోర్డర్స్ ప్రదేశాలలో కర్ఫ్యూను విధించి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను అమలుపరిచింది
ఐదు రోజులు పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి ఎటువంటి అవాస్తవ వార్తలను మీడియాలో వైరల్ కాకుండా చూసింది .
మరి ఇంత పరిస్థితులకు కారణాలను కనుక మనం చూస్తే వాటికి మూలాలు స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉన్నాయి కానీ మనం ఇక్కడ ప్రస్తుత కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం
ఒకసారి ముందుగా అక్కడ నివసిస్తున్న జనాభాను చూద్దాం
మైతేయి జనాభా అని రంగాలలో ముందు ఉన్నటువంటి జనాభా వీరిలో ఎక్కువ మంది హిందువులు మరియు ముస్లింలు కాగా కుకీలు మరియు నాగాలు కొండ జాతి వారు మరియు క్రైస్తవ మతస్తులు.
జనాభా పెరుగుతుండడం వల్ల మైతేయి జనాభా నివసిస్తున్న ప్రాంతాలు కొద్దిగానే ఉండటం వలన మైతేయి ప్రాంత ప్రజలు కొండ ప్రాంతాలలో భూములను కొనుగోలు చేయడానికి గిరిజన చట్టాలు అనుమతించు కావున మైతేయి ప్రజలు వారిని కూడా గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేయడం ప్రధాన కారణం. అదేవిధంగా కుకీలు మైతేయి జాతి వారు మణిపూర్లో ఆధిపత్యం వహిస్తుండగా వారిని గిరిజన జాతులుగా గుర్తిస్తే వారి రాష్ట్రంలోనే వారు శరణార్థులుగా మారవలసి వస్తుంది అని ఆందోళనలు ప్రారంభించారు. ఈ విధంగా ఈ రెండు జాతులు వారి వారి యొక్క ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఆందోళనల బాట చేపట్టారు.
రాజకీయపరంగా గనక గమనించినట్లయితే మణిపూర్ లో ఉన్నటువంటి 60 అసెంబ్లీ స్థానాలలో 40 స్థానాలు మైతేయి ఈ జనాభా నివసిస్తున్న మైదాన ప్రాంతాలలోనే ఉన్నాయి మిగిలినటువంటి 20 స్థానాలు కొండ ప్రాంతాలలో ఉన్నాయి దానితో మణుపూర్ ఎప్పుడు అధికారంలోకి మైతేయి ఈ జాతి వారు ఎన్నుకు అవుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఎన్ బీరేన్ సింగ్ కూడా బిజెపికి చెందినటువంటి అభ్యర్థి. వీరు కూడా మైతేయి ఈ జాతికి చెందినవారు.
మరో కారణం అయితే ఈ భాషను మణిపూర్ రాష్ట్రంలో అధికార భాషగా గుర్తించి దానిని పదవ తరగతి వరకు తప్పనిసరి భాషగా చేయటం పట్ల కూడా కుకీజాతి వారు అసంతృప్తిగా ఉన్నారు. కారణం వారి భాషా సంస్కృతులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుందని ఆందోళనలు చేపట్టారు.
ఇన్ని అసంతృప్తుల మధ్య ఈ రెండు జాతుల మధ్య ఘర్షణలు జరుగుతుండగా ప్రస్తుత పరిస్థితికి మాత్రం తక్షణ కారణంగా ఈ క్రింది అంశాన్ని చెప్పుకోవచ్చు
రాష్ట్రంలో రక్షిత అటవీ ప్రాంతమును సంరక్షించుటకు ఆ ప్రాంతాలలో ఉన్న ఆవాసాలను ప్రస్తుత ప్రభుత్వం తొలగించినది అటువంటి క్రమంలో కుకీజాతికి చెందిన ప్రజల ఆవాసాలను పడగొట్టడం జరిగింది. దీనితో ఆందోళనలు మొదలవగా అదే సమయంలో మైతేయి జాతికి చెందిన మహిళ కుకీజాతి వారి చేత చంపబడింది అనే ఒక ఫేక్ న్యూస్ వాట్సప్ లలో వైరల్ అవడంతో మైతేయి జాతికి చెందినటువంటి ప్రజలకు కుకీజాతి ప్రజలకు మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో జరిగి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మే లో మొదలైన ఆందోళనలు ప్రస్తుతం కూడా కొనసాగుతూ అక్కడ పౌర జీవన మస్తవ్యస్తమవుతూ ఆస్తుల ధ్వంసం అవుతూ మణిపర్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలా జాతుల మధ్య వైరము కొనసాగుతున్నటువంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు చేపట్టాలి అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం
ఒక ప్రాంతంలో జాతుల మధ్య వైరాలు జరుగుతున్నప్పుడు వీటిని తగ్గించాలి అని అంటే అక్కడి జాతులు ఆర్థికంగా ఒకదానిపై ఒకటి ఆధారపడేటట్లు ప్రభుత్వాలు చేయగలిగితే ఒకరికి నష్టం జరిగితే మరొకరికి కూడా నష్టం జరుగుతుంది కావున ఇటువంటి జాతి వైరాలు తలెత్తిన తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి.
మణిపూర్ లో మహిళలు సామాజికంగా ఆర్థికంగా ముందు ఉన్నప్పటికీని రాజకీయంగా మాత్రం చాలా తక్కువ శాతం మంది మాత్రమే 2018 లో జరిగిన ఎలక్షన్స్ కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే చట్టసభలోకి వెళ్ళగలిగారు రాజకీయంగా మహిళలు ఎక్కువ శాతం చట్టసభల్లోకి వెళ్లిన నాడు ఈ జాతి వైరాలకు పరిష్కారం దొరకవచ్చు కారణం మణిపూర్ లో జరిగినటువంటి స్వాతంత్రం పూర్వం నుంచి జరిగిన సామాజిక ఉద్యమాలను కనుక పరిశీలించిన ,మరియు AFSPA చట్ట వ్యతిరేక ఉద్యమాలను గమనించిన అక్కడ కీలక పాత్ర పోషించింది మహిళలే కావున మహిళల రాజకీయ ఉన్నతి మణిపూర్ ఉన్నతికి తోడ్పడగలదు.

Leave a comment